తెలంగాణ బంద్: పలుచోట్ల బస్సులు ధ్వంసం

కాగా బందు కారణంగా వరంగల్ జిల్లాలో 800, నల్గొండ జిల్లాలో 750, మెదక్ జిల్లాలో 600, ఖమ్మంలో 624, కరీంనగర్‌లో 700కు పైగా, అదిలాబాదులో 600కు పైగా, నిజామాబాదులో 629, మహబూబ్ నగర్‌లో 750కి పైగా బస్సులు డిపోల్లో నిలిచి పోయాయని సమాచారం. బయటకు వచ్చిన బస్సులను విద్యార్థులు అడ్డుకొని టైర్లలో గాలులు తీసేస్తున్నారు. మహబూబ్ నగర్‌లోని షాద్ నగర్‌లో రెండు, హైదరాబాదులోని వనస్థలిపురంలో నాలుగు, జగద్గిరిగుట్ట వద్ద రెండు బస్సులపై తెలంగాణవాదులు దాడి చేసి బస్సులను ధ్వంసం చేశారు. కాగా కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ కారణంగా నిత్యం రద్దీగా ఉండే మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్ పూర్తిగా బోసి పోయాయి.












Click it and Unblock the Notifications