రాష్ట్రం ఎలా అడుగుతారు?: మంత్రి టిజి వెంకటేష్

ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజాప్రతినిధులు అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఆరేళ్ల పాటు పని చేసిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి లేదనుకుంటే ప్యాకేజీ కోరాలని అన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోరటం సబబు కాదన్నారు. కాగా కేంద్రం 14ఎఫ్ రద్దు చేయడంతో దానిపై సానుకూలంగా వెళ్లాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదనే సదుద్దేశ్యంతోనే వారు దానిపై బెట్టు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications