కష్టకాలంలో ఉన్నాం: వైయస్ జగన్ నిర్వేదం

YS Jagan
కడప/హైదరాబాద్/ తిరుపతి: తాము కష్టకాలంలో ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన తీవ్ర నిర్వేదానికి గురైనట్లు అనిపిస్తోంది. పార్టీ పెట్టినప్పుడే కష్టాలు వస్తాయని తెలుసునని ఆయన అన్నారు. టైం బాగుంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఇప్పుడు సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఆయన బుధవారం సాయంత్రం ఆ విధంగా అన్నట్లు వార్తలు వచ్చాయి. సాయం చేయాలని వృద్ధులు కోరితే మంచి రోజులు వచ్చిన తర్వాత సాయం చేస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ రోజు కోర్టులో జరిగిందంతా విన్నానని, మాటకు కట్టుబడి ఉన్నందుకే తనకు ఈ కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై ఈ విధంగా చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెసు నుంచి బయటకు రాగానే తనకు ఐటి నోటీసులు ఇప్పించారని, మంత్రి శంకర రావుతో పిటిషన్ వేయించారని ఆయన అన్నారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఆయన అన్నారు. నైతిక విలువలు లేకుండా కాంగ్రెసు, తెలుగుదేశం కుమ్మక్కయి తనపై పోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు.

కాగా, హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సిబిఐ అధికారులు చెప్పారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రజలే తుది తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ పూర్తి స్థాయి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి పి. శంకర రావుపై మాజీ మంత్రి మూలింటి మారెప్ప హైదరాబాదులో తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు ఆదేశాలు పార్టీపై ప్రభావం చూపబోవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు అన్నారు. జార్జి ఫెర్నాండెజ్ జైలులో ఉండి కూడా ఎన్నికల్లో గెలిచారని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+