జగన్ నిరపరాధిగా బయటకు వస్తారు: కొణతాల

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ జగన్‌పై కుట్ర చేశాయని వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. తాము ప్రజా కోర్టులో తేల్చుకుంటామని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ నిజాయితీ దర్యాప్తు ద్వారా బయటపడుతుందని ఆమె అన్నారు.
ఎమ్మార్, జగన్ ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు తీర్పు ముందుగా ఊహించిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే జగన్‌పై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి కుట్రలు చేశాయని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications