ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు రాకుంటే పాతాళానికి తొక్కేస్తారు: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
అదిలాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే వెంటనే ఎస్సై పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అదిలాబాదులో అన్నారు. విద్యార్థులు ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం నెల రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షలపై ముఖ్యమంత్రి వెనక్కి తగ్గకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. గమ్యాన్ని ముద్దాడకుండా ఉద్యమాన్ని విరమించేది లేదని కెసిఆర్ అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు రాకుంటే మనల్ని సీమాంధ్ర నేతలు పాతాళానికి తొక్కేస్తారని అన్నారు. తెలంగాణ వచ్చే దాకా పోరాటం సాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ డ్రైవర్‌ను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు మరోసారి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

English summary
TRS president K Chandrasekhar Rao suggested Telangana people about Telangana state. He warned CM Kiran Kumar Reddy to postpone SI exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X