విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో వెళితే రాజీనామా చేయాలా?: పేర్ని నాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Perni Nani
విజయవాడ: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లాలనుకుంటే రాజీనామా చేయాలా అని కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. తన రాజీనామాపై కొందరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని అది సరికాదన్నారు. జగన్‌తో వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లాలా అన్నారు. గతంలో జగన్‌తో వెళ్లిన ముప్పై మంది శాసనసభ్యులు రాజీనామా చేసి వెళ్లారా అని ప్రశ్నించారు. తాను పోర్టు కోసమే రాజీనామా చేశానని అన్నారు. అందులో బొక్కలు వెతకవద్దని సూచించారు. తాను పోర్టు కోసమే రాజీనామా చేశానని అన్నారు. నాకు పదవులు, రాజకీయం కంటే నా ఊరు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

పోర్టు తర్వాతే రాజకీయాలు అన్నారు. అధికారంలో ఉండి పోర్టు కోసం ఒత్తిడి తీసుకు రావడం సామన్య విషయం కాదన్నారు. తన అంతిమ లక్ష్యం పోర్టే అన్నారు. ఈ నెల 20వ తేదిలోగా పోర్టు పనులు ప్రారంభించక పోతే రాజీనామాను వెనక్కి తీసుకునేది లేదన్నారు. 2014లోపు పోర్టు సాధించకుంటే రాజకీయాల నుండే తప్పుకుంటానన్నారు. పోర్టు సాధించలేకపోతే చరిత్రహీనుడిగా మిగులుతాననని అన్నారు. పోర్టు కోసం ఉద్యమిస్తున్న తనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. తాను పోర్టు కోసం తప్ప మరే ఉద్దేశ్యాలతో రాజీనామా చేయలేదన్నారు. ఈ ెల 21న స్పీకర్‌ను కలుస్తానని చెప్పారు. పోర్టు ఫైలు ఏడు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ఫైలు ఉన్నప్పటికీ కదలిక లేదన్నారు.

తెలంగాణ ఉద్యమానికి పోర్టుకు సంబంధం లేదని ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రేరేపించబడిందన్నారు. పోర్టు కోసం మా ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాజకీయం కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంటు 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన అనంతరం బలపడిందన్నారు.

English summary
Machilipatnam MLA Perni Nani questioned today that is resignation need to go with YSR president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X