బావ మరిది హరికృష్ణతో చంద్రబాబు ప్యాచప్

చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా చంద్రబాబు, హరికృష్ణల మధ్య ఇటీవలి దాకా ఎడమొహం, పెడమొహంగానే సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే, ఇటీవలి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు హరికృష్ణతో సంధి కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. క్రాప్ హాలిడేపై జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో సయోధ్యకు ప్రయత్నించి సఫలమైనట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో హరికృష్ణ చంద్రబాబు వెంటే ఉండడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.












Click it and Unblock the Notifications