వైయస్ జగన్ గుట్టంతా నా గుప్పిట్లో ఉంది: డిఎల్

DL Ravindra Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులకు సంబంధించి సీబీఐ విచారణలో తేలిన అంశాలకంటే కూడా ఎక్కువ అక్రమాలు జరిగాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి న్నారు. తన వద్ద ఆధారాలున్నాయని, సీబీఐ అడిగితే తప్పక ఇస్తానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైకోర్టు వద్ద అన్ని ఆధారాలు ఉన్నందువల్లనే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందన్నారు. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయనే విషయంలో కూడా సాక్ష్యాలు ఉన్నాయని మంత్రి చెప్పా రు.

జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని ఆయన అన్నారు. తాను తప్పు చేయలేదని జగన్ ఎప్పుడూ పదేపదే చెబుతుంటాడని, అది నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ ద్వారా మంచి అవకాశమని మంత్రి అన్నారు. జగన్ గురించి మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదని, అయితే సీబీఐ విచారణ ద్వారా జగన్ తన నైతికతను నిరూపించుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

కాంగ్రెస్, సోనియా వల్లే వైయస్, ఆయన కుటుంబం ఇంతటి పేరు తెచ్చుకున్నదనే విజయం గుర్తుంచుకోవాలని డీఎల్ అన్నారు. ఎమ్మార్ ప్రా పర్టీస్‌కి సంబంధించి తెరవెనుక బాగోతాలు జరిగాయన్నారు. 2002లో చంద్రబాబు హయాంలో భూకేటాయింపులు జరిగాయని మంత్రి చెబుతూ, వైఎస్ హయాంలో ఏపీఐఐసీ వాటాను నీరుగార్చారని అన్నారు. ఈ విషయం మంత్రి మండలి దృష్టికి గాని, ఏపీఐఐసీకికాని తెలియదన్నారు. ఈ అక్రమాల్లో అధికారులు, అనధికారులు కలిశారని, తెరవెనుక జరిగిన కార్యక్రమాలకు మంత్రిమండలి ఎలా బాధ్యత వహిస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+