శ్రీరామరాజ్యం నిర్మాతతో టిడిపి కార్యకర్తల ఘర్షణ

పార్టీతో సంబంధం లేకుండా ఆడియో విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయని సాయిబాబు చెప్ాపరు. అప్పటికే పాసుల పంపిణీలో అన్యాయం జరిగిందనే ఆరోపణ చేస్తున్న కార్యకర్తలను నిర్మాత మాటలు రెచ్చగొట్టాయి. పార్టీతో, అభిమానులతో సంబంధం లేకుండా ఈ వేడుక ఎలా చేస్తారంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. వారి మాటలను నిర్మాత పట్టించకోలేదు. దీంతో వారు సాయిబాబును చుట్టుముట్టారు.
నిర్మాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో నిర్మాతను నెట్టివేసే యత్నం చేశారు. దీన్ని గుర్తించిన సినీ ఆర్టిస్టు బాలాజీ సాయిబాబును హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు ఏపీ టూరిజం ముఖద్వారం వద్ద ఆందోళనకారులు గేట్లు మూశారు. ఆ చుట్టు పక్కల ఉన్న ప్రచార ఫ్లెక్సీలను చింపేశారు. ఈ నిర్మాత అందరికీ స్వాగతం చెబుతున్నట్టు ఉన్న ఫ్లెక్సీని ఏపీ టూరిజం వద్ద నుంచి తీసుకువెళ్లి పారేశారు.












Click it and Unblock the Notifications