ప్రజలు తిరుగుబాటు చేస్తారు: చంద్రబాబు హెచ్చరిక

కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిని సీరియస్‌గా తీసుకోవడం లేదని, ప్రధాని అవినీతికి సరెండరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని ఆయన అన్నారు. గతంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన పోరాటం కాంగ్రెసును చిత్తు చేసి, బంగాళాఖాతంలో పడేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. అవినీతి వల్ల రాజకీయ పార్టీలపై విశ్వాసం సన్నగిల్లుతోందని, రాజకీయ నాయకులమంతా విశ్వాసాన్ని పాదుకొల్పుకోవడానికి అవినీతిపై చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.
దేశం ప్రధాన సమస్య అవినీతి అని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాన మంత్రిని, లోకాయుక్త పరిధుల్లోకి ముఖ్యమంత్రులను తేవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications