వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టు సబబేనన్న చిదంబరం, తూటాలకు ఒకరు బలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: సామాజిక సంస్కర్త అన్నాహజారే అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను మంగళవారం కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి చిదంబరం, కపిల్ సిబాల్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. దీక్షపై పోలీసులు విధించిన షరతులను అన్నాహజారే ఒప్పుకోనందుకే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పెట్టిన షరతులను తిరస్కరించడం ప్రజాస్వామ్య విరుద్దం అన్నారు. ప్రజాస్వామ్యానికి లోబటి చేపట్టే ఆందోళనలకు గానీ, దీక్షలకు గానీ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. అన్నా ఎంచుకున్న దీక్షాస్థలి అనుకూలమైనది కాదన్నారు. జనసమ్మర్థ ప్రాంతంలో ఆయన దీక్షకు దిగడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఆయన అరెస్టు బాధాకరం అయినప్పటికీ అందులో తప్పులేదన్నారు.

దీక్షకు ముందు హజారేను కలిసేందుకు ప్రయత్నాలు చేశామని అయితే సాధ్యం కాలేదన్నారు. సహేతుక కారణాలు లేకుండా సమ్మెకు ఎవరు దిగినా అనుమతించమని అన్నారు. ఆయన ఓ నెలపాటు సాగే దీక్షకు శ్రీకారం చుట్టారని అన్నారు. పోలీసులు షరతులు విధిస్తే తిరస్కరించడం సరికాదన్నారు. దీక్షపై నచ్చజెప్పేందుకు పోలీసులు ఉదయం కూడా ప్రయత్నించారని అన్నారు. అయినప్పటికీ ఆయన దీక్షపై ముందుకెళ్లేందుకే సిద్ధపడ్డారని అన్నారు. అన్నా అరెస్టుపై కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించిందని చెప్పారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అన్నాహజారే మద్దతుదారుడిని పోలీసులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. షీలామసూద్ అనే వ్యక్తిపైపోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చంపినట్లుగా తెలుస్తోంది.

English summary
Union home minister Chidambaram felt very sad on Anna Hazare arrest. He said Anna Hazare neglected government conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X