సోనియాను వైయస్ జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?

తనను ఇబ్బంది పెట్టాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం ఎదురు తిరుగుతుందనే సంకేతాలను ఆయన ఇవ్వదలుచుకున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ సలహాదారు చాలా సార్లు ఫోన్లు చేశారని, విధానాలపై వైయస్సార్‌పై ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. తన తండ్రి ఏదైనా తప్పు చేస్తే అందులో కాంగ్రెసు పార్టీ అధిష్టానం పాత్ర ఉందని ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతోంది. అలాగే, మంత్రులు కూడా ఇరుక్కుంటారని ఆయన స్పష్టంగానే సంకేతాలిచ్చారు.
2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తప్పించుకుని, మంత్రిని బలి చేశారని జగన్ అనడంలోని ఆంతర్యాన్ని కూడా అదే రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైయస్ హయాంలో జరిగిన నిర్ణయాల్లో తప్పులుంటే ఆయా శాఖల మంత్రులు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వైయస్సార్‌కు బాధ్యత ఉండదని ఆయన చెప్పదలుచుకున్నారు.












Click it and Unblock the Notifications