టిడిపి, కాంగ్రెసు నేతలపై ఇక యుద్ధం: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతలపై ఇకపై యుద్ధం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ బుధవారం అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని వారితో రాజీనామాలు చేయించడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. రాజీనామాలు చేయని వారిని గ్రామాల్లో తిరగనివ్వవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. మహాధర్నా సకల జనుల సమ్మెకు సైరన్ లాంటిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదింపుల పేరుతో తెలంగాణను ఆలస్యం చేస్తుందన్నారు.

ఇది ఉద్యోగుల సమ్మె కాదు. సకల జనుల సమ్మె అని అన్నారు. 177 అమలుపై స్పందించిన కోర్టు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష పైనా, విద్యార్థుల చదువు పట్ల స్పందించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు ఏకమైతే ఏ శక్తి ఆపలేదన్నారు. అందుకు సంఘ సంస్కర్త అన్నాహజారేనే మంచి ఉదాహరణ అన్నారు. హజారే స్ఫూర్తిగా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్యం కోసమే కాబట్టి హజారే ఉద్యమాన్ని మనమూ సమర్థిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 9 ప్రకటన అమలు చేసేందుకు కేంద్రం వెనక్కి పోతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+