అవసరమైతే జగన్‌ను అరెస్టు చేస్తాం: సిబిఐ ప్రకటన

జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు దరణి మిశ్రా తెలిపారు. గురువారంనాడు హైదరాబాదు, బెంగుళూర్, రాజ్‌కోట్, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తా, ముంబైల్లో సోదాలు జరిగాయని, రేపు కూడా సోదాలు కొనసాగుతాయని సిబిఐ చెప్పింది.
వైయస్ జగన్ రెడ్డిపై 120బి, 420, 409, 477(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ధరణి మిశ్రా చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు బిపి ఆచార్య, పార్థసారథి రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. జగన్‌పై నమోదు చేసిన కేసుల్లో మనీ లాండరింగ్, కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం వంటి అభియోగాలున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications