విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు పాపాలాను దేవుడు చూస్తున్నాడు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయవాడ: కాంగ్రెసు, టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కై చేస్తున్న పాపాలను దేవుడు చూస్తున్నాడని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండేళ్లయినా ప్రజలు ఆయనను గుండెల్లో దాచుకోవడాన్ని తట్టుకోలేకే ఈ రెండు పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కృష్ణా జిల్లాలో మూడోరోజు సాగిన ఓదార్పు యాత్రలో ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల కోసం వైయస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర సర్కారుపై ధ్వజమెత్తారు. మళ్లీ వైయస్ సువర్ణ పాలన వస్తుందని భరోసానిచ్చారు. రాత్రి పది గంటల సమయంలో నందిగామలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

ప్రభుత్వం ఓవైపు అన్ని సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలిస్తుంటే.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెసు‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ''ప్రజల తరఫున పోరాడాల్సిన చంద్రబాబు ఆ విషయాన్ని మర్చిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు ప్రజాసమస్యలు గుర్తుకువస్తాయి. చంద్రబాబుకు అసెంబ్లీకి వెళ్లినా ఈ సమస్యలు కనబడడం లేదు. వైయస్ మాత్రమే కనపడుతున్నారు. అందుకే వైయస్ రెండేళ్ల క్రితం చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయి మహానేతపై ఇంకా బురదచల్లుతున్నారు"" అంటూ దుయ్యబట్టారు.

రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు రెండెకరాలు కూడా లేని చంద్రబాబుకు ఇప్పుడు వేలకోట్లు ఎలా వచ్చాయని, హెరిటేజ్ కంపెనీలు రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా ఎలా ఏర్పాటవుతున్నాయని నిలదీశారు. ''బాబుపై అవినీతి ఆరోపణలు వస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎంక్వైరీ వేస్తే సీబీఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు.. సిగ్గులేకుండా కాంగ్రెసు‌తో కలిసి అదే 'కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"తో విచారణ చేయించాలని ఎలా కోరుతున్నారు. దేవుడనేవాడు మీ పాపాలను చూస్తూనే ఉన్నాడు. కాంగ్రెసు, టీడీపీల నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతు అవ్వక తప్పదు"" అని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan has lashed out at Telugudesam president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X