హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో మరిన్ని సంస్థలపై దాడులు: లక్ష్మీ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల విషయంలో మరికొన్ని సంస్థలపై సోదాలు నిర్వహించే అవకాశాలను కొట్టి పారేయలేమని సిబిఐ డిజి లక్ష్మీ నారాయణ శుక్రవారం అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాలలో సేకరించిన సమాచారం ఆధారంగా మరికొన్ని సంస్థలలో సోదాలు జరగవచ్చని అన్నారు. సోదాలు కొనసాగుతున్నాయన్నారు. సోదాలకు తాము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా హైదరాబాదులోని హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులలోని 25 పైగా ముఖ్యమైన ఖాతాలను సిబిఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ఆ ఖాతాల లావాదేవీలను నిలిపి వేయాలని బ్యాంకు అధికారులను సిబిఐ లేఖ ద్వారా కోరినట్లు తెలుస్తోంది. తమ సోదాలకు ఆ ఖాతాలు ఉపయోగపడతాయని వాటి లావాదేవీలను వెంటనే నిలిపి వేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా జగన్ ఆస్తులపై సిబిఐ తమ దాడులను రెండో రోజు కొనసాగిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనుల కార్యాలయంలో, నల్గొండ జిల్లాలోని మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫెర్టిలైజర్స్ కార్యాలయాలతో పాటు పలుచోట్ల సిబిఐ దాడులు నిర్వహిస్తోంది.

English summary
CBI DG Laxmi Narayana said today that they may search in new institution also. He said searches are going on, it will take time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X