బిల్లు తెల్చే వరకు రామ్‌లీలా మైదానంలోనే: అన్నా

స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లు గడిచినా పూర్తి స్వేచ్ఛ అనుభవించలేకపోతున్నామని ఆయన అన్నారు. పోరాటం ముగిసిపోలేదని, ఇప్పుడే ప్రారంభమైందని ఆయన అన్నారు. అన్నా కోసం నిరీక్షిస్తున్నవారు దైవానికి ప్రార్థనలు చేశారు. భారత్ యావత్తూ అన్నా అంటూ నినాదాలు చేశారు. తీహార్ జైలు నుంచి ఆయన రాజ్‌ఘాట్‌కు ఊరేగింపుగా వెళ్లారు. వర్షం వల్ల ఊరేగింపు వేగంగా సాగలేదు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఊరేగింపు అమర్ జవాన్ జ్యోతి, ఇండియా గేట్ మీదుగా రామ్‌లీలా మైదానికి చేరుకుంది.












Click it and Unblock the Notifications