చిరంజీవికి పళ్లంరాజు అల్పాహార విందు, జైపాల్ హాజరు

కాంగ్రెసులో తమ పార్టీ విలీనం వల్ల మంచి జరుగుతుందని ప్రజారాజ్యాం పార్టీ శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయ సాధన కోసం తమ పార్టీ విలీనం జరుగుతోందని శాసనసభ్యురాలు వంగా గీత అన్నారు. చిరంజీవి చేరిక వల్ల తమ కాంగ్రెసు పార్టీ బలపడుతుందని పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. ప్రజాకర్షణ గల చిరంజీవి చేరిక తప్పకుండా కాంగ్రెసుకు బలాన్నిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చిరంజీవి వల్ల మంచి జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications