బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలంటున్న మంత్రి శంకరన్న

జగన్ విషయంలో హైకోర్టుకు లేఖ రాసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయాన్ని పదేపదే అందరి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని శంకర్‌రావు వాపోయారు. ఇప్పటికైనా తనకు భద్రత పెంచడంతోపాటు బుల్లెట్ ఫ్రూఫ్ కారు కేటాయించాలని ఆయన కోరారు. తనకు ప్రాణహాని జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని శంకర్రావు లేఖలో అన్నారు. భద్రత విషయంలో తాను రాసే లేఖ ఇదే చివరిదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications