లగడపాటి రాజగోపాల్ సోదరుడిపై కేసేది?: అంబటి

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లకు అనుగుణంగా మాట్లాడిన వారు పెట్టబడులు పెట్టిన వారిని పట్టించుకోవడం లేదని కేవలం జగన్ వర్గాన్నే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. సిబిఐ నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేయాలని అన్నారు. జగన్‌ను అణిచి వేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకే జగన్ వర్గ శాసనసభ్యులు భేటీ అవుతున్నారని చెప్పారు. జగన్‌కు ఏమైనా అయితే సహించేది లేదన్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిని కూకటివెళ్లతో పెకిలిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications