వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కుట్రలో పాలుపంచుకోవద్దు: ఎమ్మెల్యేలకు బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగస్వాములు కావద్దని జగన్ వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారు. పదిహేను రోజుల క్రితం వరకు సిబిఐ దర్యాఫ్తు చేయించుకోండంటూ డాంబికాలు పలికిన జగన్ వర్గంలో ఇప్పుడు అది కనిపించడం లేదన్నారు. పార్టీ అధినాయకుడు సహా అనుచరులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను వేడుకోవాలన్న తపన కనిపిస్తోందన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ లేఖ చూస్తే ప్రస్తుత పరిణామాల నుండి ఏదోవిధంగా బయటపడాలన్న తపన వారిలో కనిపిస్తోందన్నారు.

జగన్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. వ్యోక్స్ వ్యాగన్ కేసులో తనను సైతం సిబిఐ విచారించిందని, అయితే చివరకు ఆ కేసుతో నాకు సంబంధం లేదని తేల్చిందని అన్నారు. ప్రజాధరణ ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు ఆరోపణలు వస్తే విచారణ జరపకూడదా అని ప్రశ్నించారు. సిబిఐ సోదాల నుండి జగన్ కుటుంబం తప్పించుకోవాలని చూస్తుందని అన్నారు. జగన్ సిబిఐని ఎదుర్కోలేక పోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కుట్రలకు బలికావద్దని ఆయన జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు కాంగ్రెసును నమ్మి ఓటేశారు. ఇప్పుడు పక్కదారి పట్టకండని సూచించారు. రాజీనామాలు చేసినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ పూర్తిస్థాయి దర్యాఫ్తు చేస్తోందన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana suggested YSRC party chief YS Jaganmohan Reddy camp mlas that to do not participate in his culprit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X