ఇంటికో మనిషి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

నల్లధనాన్ని బయటకు తీసి దేశంలోని పిల్లల చదువుకు, పేదల ఖర్చుకు వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన కోసం యువత ముందుండాలన్నారు. అవినీతి నిర్మూలించడానికి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఇంటికో మనిషి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. గ్రామగ్రామానికి ఉద్యమాన్ని తీసుకు వెళ్లాలన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితిని గుర్తుకు తెస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications