వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట కోసం ఎందాకైనా వెళ్తా: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయవాడ: మాట కోసం ఎంత దూరమైనా వెళ్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఆదివారం రాత్రి ఆయన ఆ విధంగా అన్నారు. ఇచ్చిన మాటను గాలికి వదిలేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. మాట నిలబెట్టుకోవడమే తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు నేర్పారని ఆయన అన్నారు. మైలవలం ఓదార్పు యాత్రలో ఆయన వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తనను, తన తల్లిని ఎదుర్కోనేందుకు కాంగ్రెసు కుట్రలు చేస్తోందని, కుట్రలను ఎదుర్కోనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

ప్రజలతో మమేకమయ్యారు కాబట్టే తన తండ్రి సువర్ణ పరిపాలన అందించగలిగారని ఆయన అన్నారు. వైయస్సార్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సూచించారు. తనను, తన తల్లిని ఎదుర్కోనేందుకు టిడిపి, కాంగ్రెసు చేస్తున్న నీచమైన రాజకీయాలను దేవుడు చూస్తున్నాడని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం రైతును రోడ్డున పడిసేదందని ఆయన అంతకు ముందు జి. కొండూరు సభలో అన్నారు. వైయస్ పాలనలో ప్రతి రైతు సోదరుడికి భరోసా ఉండేదని ఆయన అన్నారు. మొదటిసారిగా రైతు సమ్మె చేసే పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని, ఎందుకిలా జరిగిందని అడిగే నాథుడు లేకుండా పోయాడని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan said that he will not take back his steps and he prepared to face ant trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X