ఇటు చిరంజీవి ఇన్, అటు జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు అవుట్

చిరంజీవికి చెందిన 16 మంది శాసనసభ్యులు సోమవారం కాంగ్రెసు సభ్యత్వం తీసుకుంటారు. ఇందుకు గాను వారంతా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావు తదితర కాంగ్రెసు ముఖ్య నేతలు గాంధీభవన్‌కు చేరుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ముఖ్య నేతలు కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నుంచి వైయస్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు హైదరాబాదులోని పంజగుట్టలో గల వైయస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత వారు రాజీనామాలు చేయడానికి అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఆ తర్వాత వారు బస్సులో బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications