జగన్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేస్తున్నారు: ఆనం

Anam Vivekananda Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఉన్నందున రాజీనామా చేశామని చెబుతున్న వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్ జగన్, ఆయన వర్గం నేతలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను రోడ్డు పైకి ఈడుస్తున్నారని విమర్శించారు.

జగన్ ఆస్తుల పైన జరుగుతున్న సిబిఐ దాడుల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వారు తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తును ఆపేందుకు రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిగి నిజాలు తెలియాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజీనామాలు చేసిన కొందరు ఎమ్మెల్యేలకు జగన్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు. జగన్ పక్కనే ఆయన అనుకూల శతృవులు ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+