వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి సాక్షిలో నాపై అడ్డగోలు రాతలు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. అవినీతి సాక్షిలో తనపై అడ్డగోలు రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో జరిగిన ప్రదర్శనలో ఆయన మంగళవారం సాయంత్రం ప్రసంగించారు. తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై త్వరలోనే అన్ని ఆధారాలతో ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పారు. తనపై కమిటీలు వేసి విచారణ జరిపించారని, ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలిందని, ప్రభుత్వం నుంచి లాభం పొందినవారు వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు. తన కుమారుడు వైయస్ జగన్ నిర్దోషి అని వైయస్ విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. గిరిజనుల భూములు లాక్కున్నారని, సెజ్‌ల పేర రైతుల సాగుపొలాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. తాను కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లు వైయస్ జగన్ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. కాంగ్రెసు అవినీతిని పెంచిపోషిస్తోందని, దానితో జత కట్టే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.

వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని వైయస్ విజయమ్మ బొత్స సత్యనారాయణపై ఆరోపణ చేశారని, అటువంటి బొత్స సత్యనారాయణకు ప్రమోషన్లు ఇచ్చారని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన గాలి సోదరులు రాష్ట్రంలోని గనులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

English summary
TDP president N Chandrababu Naidu lashed out at YSR Congress president YS Jagan's Sakshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X