హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎంకెపై అప్పుడే చిరంజీవి మాట మార్చారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అప్పుడే మాట మార్చారు! చిరంజీవి మాట మార్చింది నిన్నటి వరకు తమిళనాడును ఏలిన కరుణానిధి అధ్యక్షుడుగా ఉన్న డిఎంకె పార్టీ అవినీతి పైన. సోమవారం ప్రజారాజ్యం పార్టీకి చెందిన పదహారు మంది శాసనసభ్యులు అధికారికంగా కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిరంజీవి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తమిళనాడు ప్రజలు అవినీతికి పాల్పడిన డిఎంకె ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారన్నారు. అవినీతిపై ప్రజలు ఆలోచిస్తున్నారని అవినీతి తేటతెల్లమైన రోజున ఫలితాన్ని చూపిస్తారని అన్నారు. తమిళనాడులో అవినీతి డిఎంకె మట్టికరిచిందని అవకాశం వచ్చినప్పుడు ఇక్కడా అలాగే చేస్తారని అన్నారు.

అయితే అదే చిరంజీవి ఇటీవల డిఎంకె పార్టీని ప్రశంసల్లో ముంచెంత్తారు. కరుణానిధిపై, ఆయన ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచనల మేరకు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే తమిళనాడులోని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెసు పార్టీ డిఎంకెతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన కరుణానిధి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. డిఎంకెకు మద్దతు పలుకుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్య అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

English summary
Tirupati MLA Chiranjeevi changed his words on DMK corruption within days. He praised DMK in Tamilnadu general elections and blamed yesterdays congress meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X