ఇప్పటికి అసెంబ్లీలో చిరంజీవి పిఆర్పీ నేతనే

అసెంబ్లీలో సైతం విలీన ప్రక్రియ పూర్తి కావాలంటే పిఆర్పీ శాసనసభా పక్షం సమావేశం అయి విలీనం పూర్తి చేసుకున్న తమను కాంగ్రెసు ప్రజా ప్రతినిధులుగా గుర్తించాలంటూ తీర్మానాన్ని ఆమోదించి దానిని స్పీకర్‌కు సమర్పించారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయం వారిని కాంగ్రెసు సభ్యులుగా గుర్తించి సభలో సీట్లు కేటాయిస్తుంది. తీర్మానం సమయంలో విలీనం ఇష్టం లేదని ఎవరైనా చెబితే వారని స్వతంత్ర్య సభ్యులుగా గుర్తిస్తారు. విలీనం తనకు ఇష్టం లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఇప్పటికే స్పీకరుకు లేఖ రాసిన నేపథ్యంలో ఆమెను స్వతంత్ర సభ్యురాలుగా గుర్తిస్తూ సీటు కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications