వైయస్ జగన్‌పై రామోజీరావు ఈనాడు వార్ తీవ్రం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ సెంటిమెంటు పండలేదని, యువ ఎమ్మెల్యేలు పలకడం లేదని రాసింది. కాంగ్రెసు నుంచి కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను లాగలేకపోయిన వైయస్సార్ కాంగ్రెసు చివరికి ఒక్కో ఎమ్మెల్యే మీద పది కోట్లకు పైగా రూపాయలు కుమ్మరించేందుకు సిద్ధపడిందని కాంగ్రెసు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయని ఈనాడు రాసింది. గతంలో తమతో సన్నిహితంగా మెలిగినవారిపై రెండు, మూడు రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయని రాసింది. అయితే, డబ్బులతో ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణల్ని ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన జగన్ వర్గం నేతలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఖండించినట్లు కూడా ఈనాడు దిపత్రిక రాసింది. కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, రంగారెడ్డి తదితర జిల్లాలోని కొందరు శాసనసభ్యులతో జగన్ వర్గం నేతలు మాట్లాడినట్లు రాసింది.












Click it and Unblock the Notifications