వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షీణిస్తున్న అన్నా హజారే ఆరోగ్యం, రాహుల్ గాంధీపై ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఒకవైపు అన్నా హజారే ఆరోగ్యం క్షీణిస్తుండడం, మరో వైపు ఆయనకు మద్దతు పెరుగుతుండడంతో సమస్యను పరిష్కరించాలనే ఒత్తిడి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై పెరుగుతోంది. అన్నా దీక్షకు సరైన ప్రతిస్పందన లేకపోవడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, సమీప భవిష్యత్తులో మూడు రాష్ట్రాల ఎన్నికలపై దాని ప్రభావం పడుతుదందని మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకుడొకరు అన్నారు.

అన్నా హజారే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోందని, ఆయన డేంజర్ జోన్‌లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. వచ్చే 24, 48 గంటల్లో ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వస్తుందని అంటున్నారు. హాజారే దీక్ష మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. హజారే ఐదు కిలోల బరువు తగ్గారు. హజారే ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యుడు డాక్టర్ నరేష్ త్రెహాన్ అన్నారు.

English summary
Anna Hazare's health became a serious cause of worry on Monday as his fast entered the seventh day. It added to the concerns of the government, which was still groping for a resolution to the standoff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X