సిఎం, బాబు జిల్లాలో ఎమ్మెల్యేలు జగన్‌వైపు జంప్?

అయితే ఇటీవలి కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయిపోయిట్టుగా కనిపిస్తోంది. దీంతో పలువురు ఆయన జగన్ వర్గంలో చేరేందుకు నిర్ణయించుకోవడం వల్లనే సైలెంట్ అయినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసులో ఉండటం కంటే జగన్ వర్గంలో చేరడమే ఉత్తమమైనదిగా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు, టిడిపిల కంటే జగన్ హావానే నడుస్తుందని ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా, 2014 ఎన్నికలు జరిగినా జగన్‌తో ఉండే వారికే ఫ్యూజర్ ఉంటుందనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే షాజహాన్ సైతం పెద్దిరెడ్డి బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు మరో ఎమ్మెల్యే కూడా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications