పద్మనాభ స్వామి ఆలయంపై వియస్ సంచలన ప్రకటన

పద్మనాభస్వామి ఆలయంలో దోపిడీకి జరిగిన ప్రయత్నంపై తనకు అందిన ఫిర్యాదుతో సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు. ఒక ప్రత్యేకమైన దోపిడీ యత్నం గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. మాజీ సైనికోద్యోగులైన భద్రతాధికారులు తనకు దోపిడీ యత్నం గురించి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అకారణంగా వారి ఉద్యోగాలు పోయాయని, బహుశా దాన్ని బయటపెట్టినందు వల్లనే అలా జరిగి ఉంటుందని ఆయన అన్నారు.
అచ్యుతానందన్ ప్రకటనతో పద్మనాభస్వామి ఆలయ సంపదపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ప్రకటన అచ్యుతానందన్ స్థాయికి తగింది కాదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు.












Click it and Unblock the Notifications