గొంతు నొప్పితో బాధపడుతున్న వైయస్ జగన్

YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఆయన సోమవారం తన ఓదార్పు యాత్రను త్వరగా ముగించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఎక్కువసేపు, బిగ్గరగా మాట్లాడుతున్నందు వల్లనే సమస్య తలెత్తిందని, విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. జగన్‌కు మందులు ఇచ్చారు.

ప్రజలు పెద్ద యెత్తున వస్తుండడంతో గ్రామాల్లో ఓదార్పు యాత్ర ఆలస్యమవుతోంది. విశ్రాంతి తీసుకోకుండా ఆయన పర్యటిస్తున్నారు. ఇటీవల ఆయన జోరువానలో రాత్రి పూట ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సోమవారం సాయంత్రం ఆయనకు గొంతు నొప్పి ఎక్కువైంది. దీంతో ఆయన కొన్ని గ్రామాల పర్యటనను వాయిదా వేసుకుని బసకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+