హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌పై అంబటి రాంబాబు గుస్సా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఎబిన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌పై తనకు ఉన్న ఆగ్రహాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో బుధవారం స్పష్టంగా వ్యక్తం చేశారు. ఆ టీవీ చానెల్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్‌కు తనను సిబిఐకి అప్పగించాలనో, జైలుకు పంపాలనో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐని తన ఇంటికి తేవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రతినిధి ప్రశ్న వేయడంతో అతన్ని ఉద్దేశించి అంబటి రాంబాబు మాట్లాడారు. ఓ రోజు సిబిఐ అధికారులు వస్తారని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రతినిధి తన ఇంటి ముందుకు కాపు వేశాడని, ఏమిటని అడిగితే విషయం చెప్పాడని, తాను కొద్ది సేపు నిరీక్షించి, ఎంతకీ సిబిఐ అధికారులు రాకపోవడంతో తాను కార్యాలయానికి వెళ్లానని, తిరిగి వచ్చే వరకు కూడా అతను అలాగే ఉన్నాడని ఆయన వివరించారు.

మీ వద్ద నాకు సంబంధించిన కుంభకోణాలు ఏమైనా ఉంటే ఇవ్వండి సమాధానాలు ఇస్తానని ఆయన అన్నారు. తనను, లగడపాటి రాజగోపాల్ సోదరుడు లగడపాటి శ్రీధర్‌కు పోలిక తేవద్దని, లగడపాటి సోదరుడు సోనియాకు సన్నిహితుడని, తాను కానని ఆయన అన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎందుకు చేర్చలేదో తనకు తెలియదని ఆయన అన్నారు. తాము ఎన్ని ఎదురుదెబ్బలైనా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. కడిగిన ముత్యంలా జగన్ బయటకు వస్తారని ఆయన అన్నారు. మంత్రులంతా ముద్దాయిలుగా నిలబడాల్సి వస్తుందని, పదవులకు రాజీనామాలు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.

పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తర్వాత రాజీనామా చేస్తారని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు మద్దతుగా ఎంత మంది బయటకు వస్తారో చెప్పలేమని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుడు జీవన్ రెడ్డికి తామేమీ చెప్పలేదని, కాంగ్రెసు చేస్తున్న అన్యాయాన్ని తనంత తానుగా జీవన్ రెడ్డి ప్రశ్నించారని, అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party spokesperson Ambati Rambabu expressed his displeasure over ABN - Andhrajyothy channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X