ప్రాణం పోయినా దీక్షపై వెనక్కి తగ్గను: అన్నాహజారే

లోకాయుక్త విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దని సూచించారు. దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనలు అంగీకరించాలని లేదంటే ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానన్నారు. అవినీతిపై పోరాటం ఇది ఆరంభం మాత్రమే అని అవినీతిరహిత సమాజం కోసం సుదీర్ఘ బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై ప్రజల నుండి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇప్పటికీ కేంద్రానికి అవినీతిని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అవినీతి నిర్మూలిస్తే తమ నోటి దగ్గర కూడు పోతుందన్న ఆలోచనలో నాయకులు ఉన్నారని విమర్శించారు. లోక్‌పాల్ పరిధిలోకి గ్రామస్థాయి నుండి ప్రధాని వరకు అందరూ ఉంటారన్నారు.
లోక్‌పాల్ ద్వారా ప్రతి పౌరుడు కేటాయింపుల్లోని సమాచారం తెలుసుకుంటాడనే భయం నేతలలో ఉందన్నారు. అవినీతిపై అన్ని స్థాయిల్లో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గ్రామాలే దేవాలయాలు - ప్రజలే దేవుళ్లు - వారి సేవే పరమాత్ముని సేవ అని నాయకులు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. విశృంఖల వ్యవస్థలో ఎక్కడా అవినీతిని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సేవ మరిచి లంచాలకు మరిగారని విమర్శించారు. వారు తల్చుకుంటే 60 ఏళ్లుగా సాధ్యం కానిది పదేళ్లలో సాధ్యమవుతుందన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఆరు కేజీలు మాత్రం తగ్గానన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications