హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆడిటర్‌కు నోటీసులు: ప్రశ్నించనున్నసిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ ఆడిటర్‌కు సిబిఐ బుదవారం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. వరదరాజన్ బుధవారం ఉదయం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. జగతి ఆడిటర్‌తో పాటు జగన్ కంపెనలలో పెట్టుబడులు పెట్టిన మరో 12 కంపెనీలకూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. కంపెనీల ప్రతినిధులను సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని సిబిఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా వరదరాజన్‌ను విచారణ చాలా కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది.

జగతి ఆడిటర్ ఆయనే కావడంతో కంపెనీలో పెట్టుబడులు ఎవరెవరు పెట్టారు? ఎంతెంత పెట్టారు? పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఎలా వెళ్లాయి? తదితర అంశాలపై జగతి ఆడిటర్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆడిటర్ విచారణ ద్వారా జగతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఏమైనా లబ్ధి పొందారా? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా మంగళవారం వ్యక్తిగతంగా ఇద్దరిని సిబిఐ అధికారులు విచారించారు.

English summary
CBI issued notice to YSRC chief YS Jaganmohan Reddy's Jagathi Publications auditor Varadha Rajan today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X