లిబియాలో చిక్కుకు పోయిన మత ప్రచారకుడు కెఏ పాల్

తిరుగుబాటుదారులు విరుచుకు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశాలు లేవని పాల్ ఎపిలోని తన సన్నిహితులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. తిరుగుబాటుదారులు తమను డార్క్ రూంలోకి తీసుకెళ్లి ఉంచుతున్నారని, ఫోన్‌లు సైతం తీసుకుంటున్నారని తద్వారా తమకు ఎవరితోనూ సంబంధం లేకుండా ఉంటుందని పాల్ తన సన్నిహితులకు బుధవారం ఉదయం చెప్పారు. తమకు ప్రాణభయం తప్పిపోలేదని పాల్ చెప్పారు. పాల్ ఉన్న హోటల్‌లోనే వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రముఖులు సైతం ఉన్నారు. పాల్ ట్రిపోలీలో చిక్కుకు పోవటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications