మూడేళ్లుగా జైల్లో సత్యం రామలింగరాజు: కావూరి

సత్యం కుంభకోణం కేసులో మూడేళ్లుగా రామలింగ రాజు జైలులో ఉన్నారని, అదే అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై నిబద్ధతను తెలియజేస్తోందని ఆనయ అన్నారు. టెలికం అక్రమాలకు ఎన్డీయే ప్రభుత్వం రూపొందించిన విధానాలే కారణమని ధ్వజమెత్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత అన్న పద్ధతి ఎన్డీయే హయాంలోనే వచ్చిందన్నారు. గత ప్రభుత్వ పద్దతినే యుపిఏ కొనసాగించిందన్నారు. కాగ్ నివేదికలో శాస్త్రీయత లోపించిందని విమర్శించారు.
ప్రతిపక్షాలకు ఏదైనా ఉంటే ప్రధానికి సలహాలు ఇవ్వవచ్చు. కానీ ప్రధానిపై బురద జల్లడం సరికాదన్నారు. ప్రధానమంత్రి అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదనడం సరికాదన్నారు. ప్రభుత్వం కూలుతుందేమో అని చూడకుండా ఓ కేంద్రమంత్రిని జైలుకు పంపిన ఘనత మన్మోహన్ సింగ్‌ది అన్నారు. అవినీతిని అరికట్టేందుకు కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు. దీనికోసమే యుపిఏ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదిస్తున్న మన్మోహన్ సింగ్‌ను ఎవరైనా తప్పుపట్టగలరా అని ప్రశ్నించారు. ప్రధాని స్వయంగా పిఏసికి హాజరైన విషయం ప్రతిపక్షాలకు తెలియదా అన్నారు. ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియజేయాలనే ప్రధాని మన్మోహన్ పిఏసికి హాజరయ్యారన్నారు.
అవినీతిపై ప్రధాని స్పందించడమే ఆయన బలహీనతా అని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం లేనందునే లోక్‌పాల్ బిల్లు సాధ్యం కాదన్నారు. సమాచార హక్కుపై బిల్లు తీసుకొచ్చే సాహసం ఎన్డీయే చేయగలదా అని సవాల్ చేశారు. అవినీతిపై అవాస్తవ గణాంకాలతో ప్రజలను మభ్య పెట్టవద్దని హెచ్చరించారు. ప్రజలచే ఎన్నికైన వారు చట్టాలను చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. వారి చేసిన చట్టాలను అమలులోకి తీసుకు రావాలని లోకసభ సభ్యులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. పౌర సమాజం చట్ట సభ సభ్యుల నెత్తిపై కూర్చోకుండా చూడాలన్నారు. అభియోగాలు వచ్చిన జడ్జిని పార్లమెంటుకు రప్పించిన ఘనత కాంగ్రెసుదన్నారు.












Click it and Unblock the Notifications