చంద్రబాబు అవినీతి గుట్టు విప్పిన జగన్ సాక్షి డైలీ

ప్రభుత్వ సంస్థల విక్రయాల్లో అవినీతి అంటూ అంబటి రాంబాబు ఇచ్చిన వివరాలను ఓ పట్టిక రూపంలో సాక్షి ప్రచురించింది. అల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్, నిజాం షుగర్స్ వంటి పలు ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రయించినట్లు చెబుతూ వాటి మార్కెట్ విలువను, ప్రభుత్వం కట్టిన విలువను ఇచ్చింది. బాబు జమానాలో స్కాంలంటూ నకిలీ స్టాంపు కుంభకోణం, సోమశిల కుంభకోణం, మూసేసిన అర్బన్ బ్యాంకుల్లో డిపాజిట్లు, రహేజా సంస్థకు ఇచ్చిన స్థలం, ఏలేరు కుంభకోణం వంటివాటిని సాక్షి డైలీ క్రోడీకరించింది. అలాగే 2001లో చంద్రబాబు ఆస్తులపై తెహెల్కా తేల్చిన లెక్క అంటూ ఓ జాబితాను ఇచ్చింది. హైటెక్ సిటీ సమీపంలో 120 ఎకరాలు, మలేషియాలో షాపింగ్ మాల్, బెంగళూర్ శివార్లలో 45 ఎకరాలు అంటూ చంద్రబాబు ఆస్తుల లెక్కలను కూడా ఆ పత్రిక ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగి భూకేటాయింపుల జాబితాను కూడా ప్రచురించింది.
అయితే, తనపై బురద చల్లడానికి అవినీతి సాక్షి దినపత్రికలో రెండు పేజీలు కేటాయించారని చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తాజాగా బుధవారంనాడు సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications