అన్నా హజారే విజయం: రేపు నిరాహార దీక్ష విరమణ

లోకసభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌రపాల్ తీర్మానం ఆమోదాన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు టీమ్ అన్నా సభ్యురాలు కిరణ్ బేడీ చెప్పారు. కేంద్రంలో పటిష్టమైన లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను లోక్‌పాల్, లోకాయుక్తల పరిధిల్లోకి తెస్తారు. టైమ్‌లైన్‌తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్స్ చార్టర్స్ ఉంటాయి.
అన్నా హజారేకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ కూడా రాశారు. తీర్మానం ఆమోదం తర్వాత అన్నా హజారే రామ్‌లీలా మైదానంలో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాము సగం విజయం మాత్రమే సాధించామని, ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు. గత 12 రోజులుగా దీక్ష చేస్తున్న అన్నా హజారే రేపు ఆదివారం ఉదయం పది గంటలకు విరమిస్తారు.












Click it and Unblock the Notifications