వైయస్ మా నేత, జగన్ వర్గమే భ్రష్టు పట్టిస్తోంది: బొత్స

Botsa Satyanarayana
కాకినాడ‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని, తమ నాయకుడిని తాము భ్రష్టు పట్టించే అవకాశం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం వివిధ తెలుగు టీవీ చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులే వైయస్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్సార్‌పై పడిన మచ్చను తొలగించాల్సిన బాధ్యత వైయస్ జగన్‌దేనని ఆయన అన్నారు. వైయస్ పెద్ద దొంగ అని తమ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్య తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి ఓట్లేస్తే అవినీతికి తలుపులు బార్లా తెరిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రలోభాల వల్ల, ఇతరత్రా కారణాల వల్ల జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ కేసులో కౌంటర్ వేయాలని సలహా ఇవ్వడానికి ఆ పనేదో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని ఆయన చెప్పారు. కొన్ని ఇబ్బందుల వల్ల ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మంత్రుల శాఖల మార్పుపై దృష్టి సారించలేకపోయారని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం పెంచడానికే తాను జిల్లా పర్యటనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+