తెలంగాణ అంశాన్ని కేంద్రం తేలుస్తుంది: ముఖ్యమంత్రి

యువతకు తమ ప్రభుత్వ హయాంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిని ఎలా కల్పిస్తారని అడుగుతున్నారని, అయితే ఆ అంచనాలు హేతుబద్దంగానే జరిగాయని ఆయన అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించనంత బడ్జెట్ విద్యార్థులకు మన రాష్ట్రంలో కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు తమకు ఇష్టమైన చదువులే చదవాలని ఆయన సూచించారు. ఈ ఏడాది 27 లక్షల మందికి ఉపకార వేతనాలు చెల్లించినట్లు ఆయన తెలిపారు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సభలో మంత్రి డికె అరుణ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications