వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పార్టీలోకి రావచ్చు: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar
అనంతపురం: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆదివారం అనంతపురంలో అన్నారు. లోకసభలో బిజెపి నేత సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగమే ఇందుకు మంచి నిదర్శనం అన్నారు. వారి మైత్రి రాబోయే రోజుల్లో కనిపిస్తుందన్నారు. జగన్, బిజెపి కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని రాజీనామాలు చేసిన శాసనసభ్యులు ఎప్పుడైనా తిరిగి పార్టీలోకి రావచ్చునని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకే జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరుగుతుంటే దాన్ని రాజకీయ కక్ష అని అభివర్ణించడం తగదన్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఓ మాట, పదవి లేనప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

English summary
Anathapuram mla JC Diwakar Reddy suggested YS Jaganmohan Reddy camp MLAs in to Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X