వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వైపు రాయపాటి, కావూరి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao and Kavuri Samba Siva Rao
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు పలువురు పార్లమెంటు సభ్యులు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ కేంద్ర సహాయ మంత్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి దగ్గరి వాడైన సాయి ప్రతాప్ జగన్‌ను విమర్శిస్తున్న కాంగ్రెసు నేతలపై విరుచుకు పడ్డారు. కాంగ్రెసు నేతల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. సాయి ప్రతాప్ ఎప్పటికైనా జగన్ వైపు వెళ్లే వాడిగా అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొద్దిమంది పార్లమెంటు సభ్యులు జగన్ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, కృష్ణా జిల్లా ఎంపీ కావూరి సాంబశివ రావు సైతం అదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వక పోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయపాటి తాను జగన్ వైపో, టిడిపి వైపో ఎటైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయని, అదంతా తన కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉంటుందని మీడియా సమావేశంలో చెప్పారు. తాను చాలా ఏళ్లుగా రాయకీయాల్లో కాంగ్రెసు క్యాడర్‌ను జిల్లాలో నిలుపుకుంటూ వచ్చినప్పటికీ తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు.

గతంలో కేంద్రమంత్రి పదవి ఆశించారు. తాజాగా టిటిడి చైర్మన్ పదవి ఆశించారు. కానీ ఏదీ ఆయనను వరించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. కావూరి సాంబశివరావు సైతం తనకు అధిష్టాం ఏ పదవీ ఇవ్వక పోవడంపై అసంతృప్తిగానే ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న తెలంగాణ అంశానికి చెక్ పెట్టే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ వచ్చాక తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిఎం కిరణ్ కుమర్ రెడ్డి సైతం మరో మూడు నెలల్లో తెలంగాణ అంశం పరిష్కారమవుతుందని చెప్పారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిస్తోంది. సమైక్య వాదాన్ని బలంగా కోరుకునే కావూరి వంటి నేతలకు ఇది మింగుడు పడని విషయం. కాంగ్రెసు పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం, తెలంగాణ ప్రకటించే అవకాశాలు ఉండటం తదితర అంశాల కారణంగా కూడా కావూరి, రాయపాటి వంటి ఎంపీలు కాంగ్రెసును వీడి జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు ఎంపీలు జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

English summary
It seems, Guntur Parliament Member Rayapati Sambasiva Rao and Kavuri Samba Siva Rao may join in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X