తెలంగాణ కోసం అన్నా హజారే బాటలో: కోదండరామ్

తెలంగాణతో పాటు ప్రజాసంక్షేమం కూడా ప్రధానమేనని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోనియా అనారోగ్య కారణాల వల్ల సకల జనుల సమ్మెపై పునరాలోచించుకోవాలని ఆయన సోమవారం కరీంనగర్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. సోనియా అనారోగ్యం వల్లనే తెలంగాణపై జాప్యం జరుగుతోందని, సోనియా రాగానే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాలించే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. సోనియా ద్వారానే తెలంగాణ వస్తుందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కూడా అదే మాట అన్నారని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే రెండు రోజుల్లో తెలంగాణ వస్తుందని గతంలో అన్నవారు ఇప్పుడేమంటారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications