హైకోర్టులోనూ సత్యం రామలింగరాజుకు చుక్కెదురు

ఈ సంవత్సరం జూలై 31 వరకు కేసు దర్యాఫ్తు పూర్తి కాకపోవడంతో రామలింగరాజు సహా ఎనిమిది మంది సత్యం నిందితులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాఫ్తు తుది దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ వాదించింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో రామలింగరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా రాజుకు చుక్కెదురయింది.












Click it and Unblock the Notifications