లోకేష్‌తో మూడు గదుల ఇంటిలో ఉంటున్నా: బాబు

అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా తిరుపతిలో సోమవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "కాంగ్రెస్, వైయస్సార్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. పేదవాళ్ల పేరుచెప్పి అవినీతికి పాల్పడ్డారు. సాక్షి పత్రికలో అవినీతిని చూస్తున్నాం. నా కోసం నాలుగు పేజీలు కేటాయించారు. ఉన్నవీ లేనివీ అదేపనిగా రాస్తున్నారు. మీడియాలో ఇదేమి సంస్కృతి అని అడుగుతున్నా" అని ఆయన అన్నారు. ఒక్క అవినీతిపరుడికి మద్దతుగా 29మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
'రాష్ట్రంలో 29 మంది ఎమ్మెల్యేలు మాత్రం అవినీతిపరుడికి మద్దతుగా రాజీనామా చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. పదికోట్లు ఇచ్చారు. అవినీతి సొమ్మును ఇష్టారాజ్యంగా పంచుకుంటున్నారు" అని నిప్పులు చెరిగారు. "ఇటీవల ప్రధానికి విజయమ్మ లేఖ రాశారు. ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పలేదు. రాష్ట్రాన్ని దోచామని ఆమెకు తెలుసు" అని పేర్కొన్నారు. వోక్సువ్యాగన్‌లో అక్రమాలకు పాల్పడిన షూస్టర్‌ను జైల్లో పెడితే రాష్ట్రంలో వైఎస్‌మాత్రం బొత్సకు ప్రమోషన్ ఇచ్చారని విమర్శించారు. అన్నాహజారేను అరెస్టు చేసినప్పటి నుంచి రోడ్లపైనే ఉంటున్నానని, అవినీతికి వ్యతిరేకంగా బలమైన లోక్‌పాల్, లోకాయుక్తాలు రావాలన్నారు.












Click it and Unblock the Notifications