రాజీవ్ గాంధీ హంతకులకు ఉరిశిక్ష అమలు నిలిపివేత

తమ ఉరి శిక్ష నిలిపి వేయడంతో పాటు, రద్దు చేయాలనరి నిందితులు పెరారి వలన్, శాంతిన్, మురుగన్ కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. వీరి తరుపున రాంజఠ్మలానీ విదిస్తూ....రాజీవ్ హత్య కేసులో ఈ ముగ్గురు ఇప్పటికే 21 సంవత్సరాలగా జైలు శిక్ష్ అనుభవిస్తున్నారని, ఇది జీవిత ఖైదు కంటే ఎక్కువ అని, ఒక కేసులో నిందితులకు ఒకే శిక్ష ఉండాలి..ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా వారికి రెండు శిక్షలు అమలు చేసినట్లవుతుందని వాదించారు.
తమకు ఉరిశిక్ష్ అమలు చేయాలని నిందితులు 1991లో ఒకసారి, 2009లో ఒకసారి రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ పెట్టుకున్నారు. నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి ఇన్ని సంవత్సరాలు సమయం తీసుకోవడాన్ని గతంలోనే సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విషయాన్ని కూడా కోర్టుకు గుర్తు చేశారు. వాదోపవాదాలు విన్న కోర్టు శిక్ష అమలను 8 వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా నిందితుల తరుపు న్యాయవాదులకు ఈ కేసుకు సంబంధించి మరింత వాదన వినిపిచేందుకు సమయం దొరికినట్లయింది.












Click it and Unblock the Notifications