వైయస్ జగన్ కేసులో ఈడిపై ఇద్దరు మంత్రుల ఫిర్యాదు

ఈడీకి చెందిన ఒక ఉన్నతాధికారి జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లనే ఇప్పటివరకు జగన్‌పై కేసు నమోదు కాలేదన్న విషయాన్ని వారు ప్రధాని దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కోర్టు నుంచి ఇప్పటికే తీసుకుందని, అయినా ఈడీ తరఫున కేసు నమోదు విషయంలో నాన్పుడు ధోరణి అవలంభించడం అనుమానాస్పదంగా ఉందని వారన్నట్లు సమాచారం. దీనిపై సత్వరమే స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈడీ ఉన్నతాధికారులను పిలిపించి ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు జరిగిన దర్యా ప్తు వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications