కెసిఆర్‌కు చెక్: ఒక్కటవుతున్న కాంగ్రెసు, టిడిపి?

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును, భారతీయ జనతా పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఏకమవుతున్నట్లుగా కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలోని టిడిపి, కాంగ్రెసు నాయకులు కారాలు మిరియాలు నూరుకుంటున్నప్పటికీ ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రాంతంలో టిడిపి, కాంగ్రెసు వేలెత్తి చూపించుకున్న దాఖలాలు అరుదుగా కనిపిస్తాయి. జాతీయ పార్టీ అయిన బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉండటంతో టిఆర్ఎస్ కాంగ్రెసు, టిడిపిలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది.

మరీ ముఖ్యంగా అధికారంలో లేని తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై, తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులపై టిఆర్ఎస్ నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఎటూపాలుపోని పరిస్థితి ఆ పార్టీలకు ఉంది. దీంతో టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి ముప్పయ్యేళ్లుగా రాజకీయ శత్రువులుగా ఉన్న కాంగ్రెసు, టిడిపిలు ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కలిసి వ్యూహరచన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలు కాకుండా టిఆర్ఎస్, బిజెపిలు తెలంగాణలో అత్యధిక సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

అందుకే కెసిఆర్‌ను ఎదుర్కొనడానికి వ్యూహరచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంగళవారం మంత్రి జానారెడ్డితో భేటీ అయిన టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు ఈ విషయంపైనా చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్, బిజెపి కుమ్మక్కయ్యాయని టిడిపి, కాంగ్రెసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి ధీటుగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలు అధికారంలోకి రావాలంటే తెలంగాణలో కెసిఆర్‌కు చెక్ చెప్పాలనే ఉద్దేశ్యంతో టిడిపి, కాంగ్రెసు ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబును సమర్థిస్తూ టిడిపిలో ఉండటాన్ని కాంగ్రెసువారు, తెలంగాణ ఇవ్వగలిగే కాంగ్రెసులో ఉండటాన్ని టిడిపి వారు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+